చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్టీఓ చెక్‌పోస్టుపై అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించింది. బెంగళూరు- చెన్నై రహదారి పైన ఉన్న ఈ చెక్‌పోస్టు ద్వారా నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి... వాహనచోదకులు దగ్గర లెక్కకు మించి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఎక్కువయ్యాయి. కొన్ని ఫిర్యాదులు అందటంతో...తిరుపతి ఏసీబీ బృందం అర్ధరాత్రి మెరుపు దాడులు చేసింది. సోదాల్లో రఘునాథరెడ్డి అనే ప్రైవేటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 46 వేల 200 రూపాయలు లెక్కకు మించిన డబ్బు స్వాధీనం చేసుకున్నారు.
పలమనేరు ఆర్టీఓ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి... 46 వేలు స్వాధీనం - acb
చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్టీఓ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి చేసి 46 వేల 200 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వాహనచోదకులు దగ్గర లెక్కకు మించి డబ్బు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో దాడులు నిర్వహించారు.
పలమనేరు ఆర్టీఓ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి... 46 వేలు స్వాధీనం