ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశు వైద్య వర్శిటీ మాజీ వీసీపై అనిశా విచారణ - tirupati latest news

శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం మాజీ వీసీ హరిబాబుపై అనిశా విచారణ ప్రారంభించింది. అవినీతి ఆరోపణలు వచ్చిన మేరకు.. దర్యాప్తు జరుగుతోంది.

acb enquiry started on veterinary university ex vc in tirupati
మాజీ ఉపకులపతిపై విచారణ ప్రారంభించిన అనిశా

By

Published : May 14, 2020, 11:03 AM IST

మాజీ ఉపకులపతిపై విచారణ ప్రారంభించిన అనిశా

తిరుపతి శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం మాజీ వీసీ హరిబాబుపై.. అవినీతి నిరోధక శాఖ విచారణ ప్రారంభించింది. గత నెల 17న మూడేళ్ల పదవీ కాలం పూర్తిచేసుకున్న డాక్టర్ హరిబాబుపై.. కొందరు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆదేశించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నాబార్డ్ నుంచి పొందిన రూ. 225 కోట్ల నిధుల వినియోగంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అలాగే మిగతా వ్యవహారాల్లోనూ ఆయన అవినీతికి పాల్పడ్డారని కొందరు ఆరోపించిన మేరకు.. అనిశా అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

హరిబాబుకు సంబంధించిన సర్వీస్ రికార్డులు, గతంలో పనిచేసిన పదవులు, ఎదుర్కొన్న ఆరోపణలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ అధికారులను కోరారు.

ఇదీ చదవండి:

ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపుపై హైకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details