చిత్తూరు జిల్లా పాలసముద్రం పెద్ద చెరువులో చేపలు పట్టడానికి యువకులు వేసిన వలలో వింత చేప పడింది. ఒళ్లంతా పచ్చ బొట్టు లాంటి గీతలతో విచిత్రంగా ఉన్న చేపను యువకులు గ్రామంలోనికి తీసుకురావటంతో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు. చేపను పరిశీలించిన కొందరు నదుల్లో, మంచినీటి చెరువుల్లో పెరిగే అరుదైన జాతికి చెందిన చేపని, ఈ రకం చేపను స్థానికంగా ట్యాంక్ క్లీనింగ్ చేపగా పిలుస్తారని తెలిపారు.
పాలసముద్రంలో వలకు చిక్కిన వింత చేప - Tank cleaning fish
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం పెద్ద చెరువులో వలకు వింత చేప చిక్కింది.
పాలసముద్రంలో వలకు చిక్కిన వింత చేప