చిత్తూరు జిల్లా తిరుమల బాలాజీ నగర్‌కు చెందిన శశికళ అనే ఆరేళ్ల చిన్నారి నీటి తోట్టిలో పడి మరణించింది. రామచంద్రపురం మండలం, నెత్తకుప్పానికి చెందిన భానుప్రకాష్ , జయంతి దంపతులు తిరుమలలో వ్యాపారం చేసుకొని జీవిస్తుంటారు. భానుప్రకాష్ వ్యాపారం కోసం దుకాణానికి వెళ్లగా... తల్లి వంట చేస్తోంది. ఇదే సమయంలో ఆడుకుంటున్న వారి కుమార్తె శశికళ నీటి తోట్టిలో పడింది. కొంత సమయానికి గమనించిన తల్లి జయంతి... పాపను వెంటనే అశ్వని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పాప మృతి తో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
నీటి తోట్టిలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి - తిరుమలలో ప్రమాద మరణాలు
నీటి తోట్టేలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. తల్లి వంట పనుల్లో నిమగ్నమవగా ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి నీటి తోట్టిలో పడి మృతి చెందింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.
నీటి తోట్టేలో పడి ఆరేళ్ల చిన్నారి మృతి