చిత్తూరు జిల్లా గంగవరం మండలం చిన్నూరు గ్రామం వద్ద బెంగళూరు-చెన్నై జాతీయరహదారిపై... జరిగిన రోడ్డు ప్రమాదంలో పూర్ణచంద్ర అనే వ్యక్తి మృతి చెందాడు. వ్యవసాయ బోర్లు వేసే పరికరం కోసం వెళ్తుండగా.. కారు అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొట్టింది. బైపాస్ రోడ్డు ఫ్లై ఓవర్‌పై నుంచి సర్వీసు పడిపోవటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతిడి స్నేహితుడు వినయ్.. స్వల్పగాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రుడిని గంగవరం పోలీసులు పలమనేరు వైద్యశాలకు తరలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కారు బోల్తా... ఒకరు మృతి - చిత్తూరులో రోడ్డు ప్రమాదం
గంగవరం మండలం చిన్నూరు గ్రామం వద్ద బెంగళూరు-చెన్నై జాతీయరహదారిపై... జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
a Person died in road accident at chinnuru in chittoor