చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి విస్తరణ పనులు కోసం చేపట్టిన భూసేకరణలో భారీ కుంభకోణం జరిగిందని అదే గ్రామానికి చెందిన మార్కండేయ నాయుడు ఆరోపించారు. దీనికి సంబంధించిన విషయాలను ఆయన మంగళవారం మీడియాకు వెల్లడించారు.
'నకిలీ పత్రాలతో రూ.50 లక్షలు మాయం'
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి విస్తరణ పనులు కోసం చేపట్టిన భూసేకరణలో భారీ కుంభకోణం జరిగిందని ఓ వ్యక్తి ఆరోపిస్తున్నారు. నకిలీ పట్టాలు స్పష్టించి కొందరు సుమారు 50 లక్షల రూపాయలు దోచుకున్నారని ఆయన మీడియాకు వెల్లడించారు.
నకిలీ పట్టాలు స్పష్టించి సుమారు 50 లక్షల రూపాయలు దోచుకున్నారని చెప్పారు. సమాచార హక్కు చట్టం సాయంతో ఈ వివరాలు తనకు తెలిశాయన్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ సొమ్ము మాయం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీసులకు రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశానన్నారు.
అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన రాకపోవటంతో మీడియాను ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి దుర్వినియోగం అయిన ప్రజాధనాన్ని తిరిగి ప్రభుత్వ ఖజానాలో చేర్చాలని మార్కండేయ కోరారు.