కడప జిల్లా రాజంపేటలో బైపాస్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మహిళ తీవ్రంగా గాయపడ్డారు. పుల్లంపేట మండలం వేల్పులవారిపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర రాజు, శ్యామలమ్మ అనే మహిళతో ద్విచక్ర వాహనంపై బోయనపల్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనకనుంచి వచ్చిన ఐచర్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరాజు అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన శ్యామలమ్మను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడనుంచి కడపకు తరలించారు. సమాచారం తెలుసుకున్న మన్నూరు పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి.. మహిళకు తీవ్ర గాయాలు - కడప జిల్లా రాజంపేటలో బైపాస్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం
ద్విచక్ర వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన కడప జిల్లా రాజంపేటలోని బైపాస్ రోడ్డుపై జరిగింది.
కడపలో రోడ్డు ప్రమాదం: ఒకరు అక్కడికక్కడే మృతి, మహిళకు గాయాలు