దేశ సరిహద్దులోని శ్రీనగర్‌లో చిత్తూరు జిల్లాకు చెందిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. చౌడేపల్లి మండలం కాసిపేరికి చెందిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు(26) మిస్ ఫైర్ వల్ల ప్రాణాలొదిలినట్లు అతని కుటుంబసభ్యులకు సమాచారం అందింది.
మారప్ప, ముత్యాలమ్మ దంపతుల నాలుగో సంతానం శ్రీనివాసులు. జనవరి నుంచి శ్రీనగర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. అతను మృతి చెందాడన్న వార్తతో కాసిపేరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహం కోసం కుటుంబీకులు, బంధుమిత్రులు ఎదురుచూస్తున్నారు.