ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ - చిత్తూరు జిల్లాలో బాలిక కిడ్నాప్ వార్తలు

పాఠశాలకు వెళ్లిన తన కూతురు కిడ్నాప్​న​కు గురైందని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తన కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లిపోయారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

girl kidnap
girl kidnap

By

Published : Nov 11, 2020, 4:24 PM IST

చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం బూర్లపల్లె ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్​న​కు గురైంది. ఈ మేరకు ఆమె తండ్రి వెంకట్​రెడ్డి పెద్దతిప్ప సముద్రం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పాఠశాల నుంచి ఇంటికి చేరుకునేందుకు బస్​స్టాప్ వద్ద సహచర బాలికలతో వేచి ఉండగా దుండగులు తన కూతురిని అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details