ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా లేదని వాదించారు.. వైరస్​ కొని తెచ్చుకున్నారు..

కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహానికి కరోనా పరీక్షలు చేయాలని గ్రామస్థులు కోరారు. అవసరం లేదు.. అనారోగ్యంతోనే చనిపోయాడని మృతుని బంధువులు వాదించి.. ఖననం చేసేశారు. చివరకు అంత్యక్రియల్లో పాల్గొన్న ఏడుగురు కరోనా బారిన పడ్డారు. గ్రామంలో 22 మందికి వైరస్​ పాజిటివ్​గా అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఇంకా ఎంతమందికి కరోనా అంటుకుందోనని ఆ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లా రంగంపేటలో జరిగిన ఘటన వివరాలివి..!

కరోనా లేదని వాదించారు.. వైరస్​ కొనితెచ్చుకున్నారు..!
కరోనా లేదని వాదించారు.. వైరస్​ కొనితెచ్చుకున్నారు..!

By

Published : Jul 27, 2020, 4:09 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో 2 రోజుల క్రితం కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ మృతదేహానికి కొవిడ్ పరీక్ష చేయించాలని గ్రామస్థులు కోరారు. కుటుంబసభ్యులు ఆ వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడంటూ వాదించి.. సమీపంలోని శ్మశానవాటికలో ఖననం చేశారు. అతని కుటుంబ సభ్యులు కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకున్నారు. తీరా ఆ ఇంట్లో ఏడుగురికి పాజిటివ్‌గా తేలింది.

రంగంపేటకు చెందిన మరో నలుగురుకి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. అంత్యక్రియల్లో పాల్లొన్న మరి కొందరి ఫలితాలు రావాల్సి ఉంది. గ్రామంలో ఇప్పటివరకు మొత్తం 22 మందికి పాజిటివ్​గా నిర్ధారించారు. ఈ క్రమంలో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details