రాష్ట్రవ్యాప్తంగా నాలుగు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధి(URBAN DEVELOPMENT AUTHORITY INCREASED) పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. తిరుపతి, కర్నూలు, చిత్తూరు, పలమనేరు-కుప్పం-మదనపల్లె అథారిటీల్లో..సమీప గ్రామాలను చేర్చింది. తాజా నిర్ణయంతో..ఆయా అథారిటీల విస్తృతి మరింత పెరగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 4 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధి పెంపు - ఏపీ వార్తలు
19:56 September 23
నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం
అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల విషయంలో..ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధి పెంచుతూ..నోటిఫికేషన్లు విడుదల చేసింది. తిరుపతి, కర్నూలు, చిత్తూరు, పలమనేరు-కుప్పం-మదనపల్లె అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధి విస్తృతంగా పెంచుతూ..వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేసింది. తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలోకి..యర్రావారిపల్లె మండలంలోని 12 గ్రామాలను చేర్చింది. దీంతో కొత్తగా 185 చదరపు కిలోమీటర్ల ప్రాంతం తుడా పరిధిలోకి రానుంది. ఫలితంగా..తుడా పరిధి 4 వేల 657 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఇక..చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో..కొత్తగా 48 గ్రామాలు చేరాయి. చుడా పరిధిలోకి కొత్తగా 3 మండలాల్లోని 662 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తీసుకువస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక..పలమనేరు-కుప్పం-మదనపల్లె అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి..కొత్తగా ఆరు మండలాలను కలుపుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పీకేఎం ఉడా పరిధిలోకి..కొత్తగా 14 వందల 39 చదరపు కిలోమీటర్లు చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో..పీకేఎం ఉడా పరిధి 3,875 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి..మొత్తం 15 మండలాల్లోని 129 గ్రామాలు రానున్నాయి. ఆళ్లగడ్డ మండలంలో 8 గ్రామాలు..చాగలమర్రి పరిధిలో 6 గ్రామాలు, డోర్నిపాడు, రుద్రవరం, గోస్పాడు, ఉయ్యాలవాడ మండలాల పరిధిలో 23 గ్రామాలు, ఆత్మకూరు, బండిఆత్మకూరు, మహానంది మండలాల్లోని వేర్వేరు గ్రామాలు..కుడా పరిధిలోకి వచ్చాయి. వెలిగోడు, నంద్యాల, బనగానపల్లె పరిధిలో 14, కోయిలకుంట్ల మండలంలో 18 గ్రామాలు..సంజమల, కొలిమిగుండ్ల మండలాల్లోని గ్రామాలను సైతం..కుడా పరిధిలో చేర్చారు. ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న 98 చదరపు కిలోమీటర్ల ప్రాంతంతో కలిపి..కొత్తగా 17 వందల 93 చదరపు కిలోమీటర్ల ప్రాంతం కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో భాగమైంది. ఫలితంగా..కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి 12 వేల 786 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
ఇదీ చదవండి