చిత్తూరు జిల్లా పాకాల మండలంలో దాడి చేసి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు ముసుగు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం డీఎస్పీ సుధాకర్ రెడ్డి వివరాలను మీడియాకు వెల్లడించారు. పాకాలకు చెందిన వైకాపా నేత చెన్నకేశవరెడ్డి అతని భార్యపై గుర్తు తెలియని దుండగులు ఫిబ్రవరి 2వ తేదీ అర్థరాత్రి దాడికి తెగబడ్డారు. ముసుగులు ధరించిన ఆరుగురు దుండగులు మారణాయుధాలతో దాడి చేసి ఇంట్లోని 160 గ్రాముల బంగారం, 3లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇవాళ నేండ్రగుంట వద్ద తమిళనాడుకు చెందిన ధర్మలింగం, కుప్పంకు చెందిన శబరిగీష్ను అదుపులోకి తీసుకున్నారు.
వైకాపా నేత ఇంట్లో దాడి చేసి చోరీకి పాల్పడిన నిందితులు అరెస్ట్ - ycp leader home thefts arrest
చిత్తూరు జిల్లా వైకాపా చెన్నకేశవరెడ్డి ఇంట్లో చొరబడి దాడి చేసి బంగారం, నగదు దోచుకెళ్లిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పాకాల పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేయగా.. ముఠాలోని మిగిలిన సభ్యుల కోసం గాలిస్తున్నట్లు చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు.
arrest
ముఠాలోని మరో ఇద్దరు దుండగులు మురుగన్, శరవణన్ తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. వీరిపై తమిళనాడు, ఆంధ్రాలోని పలు పోలీస్టేషన్లలో 11 కేసులు నమోదై ఉన్నాయని అన్నారు. మిగిలిన ఇద్దరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. నిందితుల వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఇదీ చదవండి:రుయా ఆస్పత్రి ఫార్మాసిస్ట్ త్యాగరాజులునాయుడు ఆత్మహత్యాయత్నం