ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుడిగాలి ప్రచారానికి సిద్ధంగా వైకాపా - విజయ

ఎన్నికల సమయం దగ్గడపడుతున్న వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేయాలని వైకాపా భావిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రచార సభలు ఏర్పాటు చేస్తోంది. వైకాపా అధ్యక్షుడు జగన్ సహా ఆయన తల్లి విజయ, సోదరి షర్మిల ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు.

సుడిగాలి ప్రచారానికి వైకాపా సిద్ధం

By

Published : Mar 16, 2019, 1:40 PM IST

ప్రచారానికి వైకాపా

ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందిస్తున్న వైకాపాఅధినేతజగన్ ... ప్రణాళిక బద్ధంగా ప్రచార కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. ఇప్పటికే ఆయన ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. 41 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టలేదు. ఈ ప్రాంతాల్లోనేబహిరంగసభల ఏర్పాటుకు జగన్ ప్రాధాన్యతనిస్తున్నారు. అభ్యర్థులు బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ సభల ఏర్పాటు చేయనున్నారు.

రోజుకు 3 సభలు
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు చేసిన జగన్ ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర 134 నియోజకవర్గాల మీదుగా కొనసాగింది. పాదయాత్ర చేయని...41 నియోజకవర్గాలపై వైకాపా ప్రధాన దృష్టి కేంద్రీకరిస్తోంది. మెుదట బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్న వైకాపా అధినేత... సమయం ఉన్న కారణంగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.సుడిగాలి పర్యటనలు చేయాలని నిర్ణయించారు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున... ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందించారు.ఉదయం 9 గంటల 30 నిమిషాలకు, 11 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు సభలు ప్రారంభం కానున్నాయి.

ఆదివారం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం ప్రచార సభకు జగన్ హాజరవుతారు. అదే రోజు విజయనగరం జిల్లానెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడలో రెండో సభలో పాల్గొంటారు. తూర్పుగోదావరి జిల్లాపి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట సభకు హాజరవుతారు. 18న కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లులో, అనంతపురం జిల్లా రాయదుర్గంలో, కడప జిల్లా కృష్ణా జిల్లా అవనిగడ్డలో, గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ కేంద్రంలోని బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగించుకుని హైదరాబాద్​కు బయలుదేరనున్నట్లు తెలిసింది.

ప్రచారానికివిజయ, షర్మిల

జగన్​కు 26 రోజుల్లో 40 నియోజకవర్గాలే తిరిగే అవకాశం ఉందని పార్టీ భావిస్తోంది. మిగిలిన నియోజక వర్గాల్లో జగన్ తల్లి విజయ, సోదరి షర్మిల ప్రచార సభలు నిర్వహించేలా వైకాపా నిర్ణయించింది. ముగ్గురూ 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా ప్రణాళిక రూపొందుతోంది. మరోవైపు రెండు మూడు రోజుల్లో వైకాపా మేనిఫెస్టో విడుదల కానుంది. పాదయాత్రలో జగన్ దృష్టికి వచ్చిన అంశాలు, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వినతులు, సలహాలు, సూచనలకు ప్రాధాన్యం ఇచ్చి ఎన్నికల ప్రణాళిక రూపొందించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.

ABOUT THE AUTHOR

...view details