గుంటూరు సభలో వైకాపా అజెండాను ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేశారని మంత్రి జవహర్ మండిపడ్డారు. ప్రత్యేక హోదా , విభజన హమీల అమలులో నమ్మకద్రోహం చేసిన ప్రధాని రాకను నవ్యాంధ్ర ప్రజానీకం ముక్తకంఠంతో వ్యతిరేకించిందన్నారు. జగన్ లాంటి ఆర్థిక నేరగాళ్లను కాపాడడమే మోదీ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబును తిట్టడమే ధ్యేయంగా సభ ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, స్టీల్‌ప్లాంట్, రైల్వేజోన్ వంటి అంశాలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.