అసెంబ్లీ లాబీలో యనమల, జేసీ మధ్య ఆసక్తికర సంభాషణ - jc
తెదేపా సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, జేసీ దివాకర్ రెడ్డిల మధ్య అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. రాయలసీమపై కోపం తగ్గిందా అని జేసీ ప్రశ్నించగా.. మీ వల్లే నష్టం జరిగిందని యనమల బదులిచ్చారు.
యనమల
ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభ లాబీల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెదేపా నేతలు యనమల, జేసీ దివాకర్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడగా... రాయలసీమపై కోపం తగ్గిందా అంటూ జేసీ యనమలను పశ్నించారు. దీనిపై స్పందించిన యనమల రామకృష్ణుడు మీ వల్లే నష్టం జరిగిందంటూ సమాధానమిచ్చారు. దీంతో ఇరువురి నేతల మధ్య నవ్వులు పూశాయి.