ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''దిల్లీలో స్కెచ్చేసి.. రాష్ట్రంలో దొరికిపోయారు''

తెదేపాను బలహీనపరిచేందుకు వైకాపా, తెరాస, భాజపా కలిసి డేటా చోరీ కుట్రకు తెరతీశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని కీలక విషయాలను మీడియాకు వివరించారు.

By

Published : Mar 9, 2019, 4:45 PM IST

Updated : Mar 9, 2019, 7:22 PM IST

సాక్ష్యాలను చూపిస్తున్న సీఎం

సాక్ష్యాలను వివరిస్తున్న సీఎం
ఐటీ గ్రిడ్ సంస్థపై కుట్ర ప్రకారమే తెలంగాణ పోలీసులు సోదాలు జరిపి తెదేపా డేటాను చోరీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. వైకాపా, తెరాస, భాజపా కలిసి ఈ కుట్ర చేశాయన్నారు. జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘానికి వైకాపా ఇచ్చిన ఫిర్యాదు పత్రాన్ని మీడియా ఎదుట పెట్టారు. ఈసీకి ఇచ్చిన నోట్​తో పాటు వైకాపా రాసుకున్నప్రణాళిక పత్రాలనూ చూపించారు. ఐటీ గ్రిడ్ సంస్థపై కేసు పెట్టడం మొదలు.. ఎవరెవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న సూచనలు ఇందులో ఉన్నాయని చదివి వినిపించారు. ఈ ప్రకారమే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని ఆరోపించారు. డేటా గ్రిడ్ సంస్థ తెదేపాకు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ అని స్పష్టం చేశారు.
Last Updated : Mar 9, 2019, 7:22 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details