నేటి శాసనసభలో.. ఏం జరుగుతుందంటే..!
వారాంతపు సెలవు తర్వాత.. శాసనసభా సమరానికి అధికార, ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. కీలక విషయాలను సభలో ప్రస్తావించనున్నాయి.
అధికార, విపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు వాడీ వేడిగా జరుగుతున్నాయి. వారాంతపు సెలవు అనంతరం.. ఈ రోజు జరిగే శాసనసభ ముందుకు కీలక అంశాలు రానున్నాయి. ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. 104, 108 సర్వీసుల పనితీరు... రైతులకు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులో ఆలస్యంపై వైకాపా సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. గ్రామీణ గృహ నిర్మాణం లబ్ధిదారులకు చెల్లింపుల నిలిపివేత, అఖండ గోదావరి ప్రాజెక్టుపై తెదేపా సభ్యులు ప్రశ్నలు వేయనున్నారు. రేషన్ డీలర్ల తొలగింపుపై జనసేన ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్ ప్రశ్నించనున్నారు. మరోవైపు.. పీఏసీ కమిటీ , బడ్జెట్ ఎస్టిమేషన్స్ కమిటీ, ప్రభుత్వరంగ సంస్థల కమిటీలకు సంబంధించి వైకాపా సభ్యులను ముఖ్యమంత్రి జగన్ ఈ రోజే ప్రకటించనున్నారు.