చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోసార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమరానికి సిద్ధమయ్యారు.ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాలుపై నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధే మంత్రంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థలను ప్రకటించారు. నేతలంతా సమష్టిగా పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జగన్కు అర్హత లేదు
అదేవిధంగా ప్రతిపక్షపార్టీలు అనుసరిస్తున్న తీరును ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉండని వారికి ఎన్నికల్లో పోటి చేసే అర్హత లేదని వైకాపా అధినేత జగన్ను ఉద్ధేశించి వ్యాఖ్యనించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతుంటే జగన్ కేసీఆర్ కు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేసిన కేసీఆర్, కేంద్రంతో కుమ్మక్కైన జగన్కు ఓటు అడిగే హక్కే లేదని ధ్వజమెత్తారు.