ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన సీపీ ద్వారకా
విజయవాడ ధనేకుల ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాలను సీపీ ద్వారకా తిరమల రావు పరిశీలించారు. కేంద్రం లోపల ఎలాంటి అల్లర్లకు తావునివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు.
విజయవాడ ధనేకుల ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇక్కడే ఒట్ల లెక్కింపు జరగనుంది. నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత పరిశీలించారు. కేంద్రం వెలుపల ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని సీపీ తెలిపారు. లెక్కింపు రోజు విజయోత్సవ ర్యాలీలకు అనుమతిలేదని తెలిపారు.