'ఈ మూడు రంగాలే దేశాన్ని ప్రభావితం చేస్తాయి' - 'ప్రజలపై ఈ మూడు రంగాల ప్రభావం ఎక్కువ'
పత్రికలు వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాలు కాకుండా సమాజానికి ఉపయోగపడినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ తరానికి నాటితరం ఆలోచనలు, విలువలు చాటిచెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
దేశాన్ని ప్రభావితం చేసే శక్తి రాజకీయ, సినిమా, పాత్రికేయ రంగాలకు ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీసీలో ప్రఖుక పాత్రికేయుడు, రచయిత గోవిందు రామశాస్త్రి శతజయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోవిందు రామశాస్త్రి భాష, సాహిత్యం, పత్రికారంగాల్లో ఎంతో కృషి చేశారని కొనియాడారు. గోరా శాస్త్రి సంపాదకీయాలకు చాలా ఆదరణ ఉండేదన్నారు. నేటి తరానికి ఆస్తిని రూపాయలుగా కాకుండా అక్షరాల రూపంలో ఇచ్చే వ్యక్తులు చాలా అరుదని వెంకయ్య నాయుడు అన్నారు.
- ఇదీ చూడండి : తిరుపతిలో కూలిన భవనం.. శిథిలాల్లో ఒకరు మృతి
TAGGED:
wise president