వైకాపా కీలక నేత విజయ సాయిరెడ్డి ట్వీట్‌కు తెదేపా సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ప్రతి ట్వీట్ చేశారు. నీతి ఉన్నవాళ్లు ప్రక్షాళనను తమ ఇంటినుంచే మొదలు పెడతారని హితబోధ చేశారు. తొలుత ఇడుపులపాయ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావేదిక వద్దకు వచ్చిన ప్రజలు ఏమనుకున్నారో మీరు వినలేదన్న వర్ల... వైకాపాకు అధికారం ఇచ్చి తప్పు చేశామా అనే సందిగ్ధంలో పడ్డారని పేర్కొన్నారు.
ముందు ఇడుపులపాయ అక్రమాలపై చర్యలు తీసుకోండి: వర్ల
వైకాపా, తెదేపా నేతల మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది. విజయసాయిరెడ్డి ట్వీట్‌కు వర్ల రామయ్య ప్రతి ట్వీట్ చేశారు.
వైకాపా, తెదేపా నేతల మధ్య ట్వీట్ వార్