ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఫొని' తుపాను... బిక్కుబిక్కుమంటున్న రైతన్నలు

తుపాను అనే పేరు వింటే చాలు... రైతన్నల గుండెల్లో గుబులు మెుదలవుతుంది. హుద్​ హుద్, పెథాయ్, తిత్లీ తుపాన్​లు ఇలా వచ్చి అలా వెళ్లినవే..కానీ అవి సృష్టించిన విధ్వంసం మాటలకు అందనిది. లక్షల ఎకరాల్లో పంట నష్టం, కోట్ల రూపాయల ఆస్తి నష్టం.. ఇప్పటికీ కొన్ని కుటుంబాలు వాటి ప్రభావంతో కోలుకోలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఫొని పేరు వారి గుండెల్ని మెలేస్తోంది.

By

Published : Apr 29, 2019, 12:44 PM IST

Updated : Apr 29, 2019, 5:51 PM IST

'ఫొని' తుపాను... బిక్కుబిక్కుమంటున్న రైతన్నలు

'ఫొని' తుపాను... బిక్కుబిక్కుమంటున్న రైతన్నలు

ఏ తుపాను వచ్చినా రైతన్నల కంట నీరు మిగిల్చే వెళ్తోంది. ఈసారి సరిగ్గా రబీ పంట చేతికి వచ్చే సమయంలో ఫొని తుపాను ఎలాంటి కష్టం కలిగిస్తుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నాడు. సరైన ధరల్లేక, చేలల్లోనే పంటను కుప్పలుగా పోశారు. తుపాను ధాటికి ఎలాంటి ఉపద్రవం వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ ఆకాశం వైపు చూస్తున్నాడు. గత తుపానులు మిగిల్చిన విషాదాన్ని గుర్తు చేసుకొని భయపడుతున్నారు.
కోస్తాపై ఫొని తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుందని అధికారులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో 70 వేల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఇప్పటి వరకు సుమారు 60 వేల ఎకరాల వరి కుప్పలు నూర్చి వేశారు. కూలీలు, ట్రాక్టర్ల కొరత, మద్దతు ధర లేక 10 వేల ఎకరాల్లో వరి పొలాల్లోనే ఉంది. ఒక్క కృష్ణా జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రబీలో 7.60 లక్షల హెక్టార్లలో వరి సేద్యమవుతుందని... 53 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడులు వస్తాయని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించగా 6.31 లక్షల హెక్టార్లలోనే సాగైంది. ఆ మేరకు రబీలో సుమారు 40 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొస్తాయని అంచనా వేశారు. సరిగ్గా ఇప్పుడే తుపాను కారణంగా..అక్కడక్కడ పంట నష్టం వాటిల్లింది.
కొందరు రైతులు అంతర్ పంటగా మినుము, మెుక్క జోన్న పంటలు వేశారు. తుపాను హెచ్చరికలతో కొంతమంది పంట కోయకపోగా... కోసిన పంట ఎక్కడ నాశమవుతుందోనని ఇంకొందరు ఆందోళన చెందుతున్నారు. పసుపు పంటకూ ముప్పు పొంచి ఉందని వాపోతున్నారు.

Last Updated : Apr 29, 2019, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details