ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 5, 2019, 11:50 AM IST

ETV Bharat / state

బాబు, నవీన్​లతో చర్చించాకే నిర్ణయం:మమతా

తాను చేస్తున్న దీక్షపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్​ను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని బంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

దీక్షపై తుది నిర్ణయం!

దీక్షపై తుది నిర్ణయం!
శారదా కుంభకోణంపై విచారణ నిమిత్తం కేంద్రం, పశ్చిమబంగ ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. బంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు అధిపతిగా వ్యవహారించిన రాజీవ్ కుమార్.. సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో బంగాల్‌ సీఎస్‌, డీజీపీ, సీపీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18 లోపు ధిక్కరణ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆజ్ఞాపించింది. తదుపరి విచారణను 20 వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీం తీర్పుపై ఆ రాష్ట్ర సీఎం మమతా స్పందించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు. సీబీఐ తీరు కేవలం రాజకీయ కక్షసాధింపేనని ఆరోపించారు. తాను చేస్తున్న దీక్షపై... ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లను సంప్రదించిన తర్వాత విరమణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details