రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులుపడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరిక జారీ చేసింది. కడప జిల్లాలోని టి.సుండుపల్లి, రాజంపేట, ఓబులవారిపల్లె ప్రాంతాలతోపాటు, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, పుల్లలచెరువు , యర్రగొండపాలెం. గుంటూరు జిల్లాలోని మాచర్ల, దుర్గి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి ప్రాంతాల్లో పిడుగులు పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రజలు చెట్ల కింద, పంట పొలాల్లో ఉండకూడదని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.
కడప, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పిడుగులు! - thunder
వాతవరణంలో సంభవించే మార్పుల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది.
rtgs