భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు ఎంపీ సుజనాచౌదరి ప్రకటించారు. రాజ్యసభలో భాజపాకు బలం తక్కువగా ఉందని ఎంపీ టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం పాలక పక్షం వైపు వెళ్లాలనుకున్నామన్న టీజీ... తాను విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో పని చేశానని గుర్తు చేశారు. అప్పటినుంచే తనకు భాజపాతో అనుబంధం ఉందని టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశానని అన్నారు. భాజపా వాళ్లు ఆహ్వానించారన్న టీజీ వెంకటేశ్... రాయలసీమ అభివృద్ధి కోసమే తెదేపాను వీడుతున్నామని స్పష్టం చేశారు.
అందుకే పాలకపక్షం వైపు వెళ్తున్నాం: టీజీ వెంకటేశ్ - టీజీ వెంకటేశ్
రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసమే తాను భాజపాలో చేరుతున్నానని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు.
టీజీ వెంకటేశ్