ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్రంలో నిప్పులు కక్కుతున్న భానుడు

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ప్రకాశం జిల్లాలో రికార్డ్​ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు వడగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉందని ఆర్టీజీఎస్‌ హెచ్చరికలు జారీ చేసింది.

నిప్పులుకక్కుతున్న భానుడు

By

Published : May 10, 2019, 9:20 AM IST

Updated : May 10, 2019, 4:41 PM IST

రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపుస్తున్నాడు. ప్రకాశం జిల్లాలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రత న‌మోదయ్యింది. జిల్లాలోని త్రిపురాంత‌కంలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత న‌మోదు అయ్యింది. పశ్చిమ గోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఆర్టీజీఎస్ తెలిపింది. కృష్ణా, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు.

రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు న‌మోదయ్యాయి. 42 ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీలు,.. 85 ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీలు,.. 480 ప్రాంతాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు న‌మోదయ్యాయి.

జిల్లా ప్రాంతాలు ఉష్ణోగ్రతలు
ప్రకాశం

త్రిపురాంత‌కం

47
ముండ్లమూరు

46.51

పెద‌చెర్లోపల్లి 46.41 చిత్తూరు విజ‌య‌పురం 46.17 తిరుప‌తి 43.40 ఏర్పేడు 45.72 నాగ‌లాపురం 45.58 నెల్లూరు పొద‌ల‌కూరు 46.15 గుంటూరు మాచ‌వ‌రం 45.55 క‌ర్నూలు క‌ర్నూలు 45.51 క‌డ‌ప కొండాపురం 45.16 కృష్ణా పెనుగంచిప్రోలు 45.12 తూర్పుగోదావరి రాజమహేంద్రవరం 44 కాకినాడ 43 పశ్చిమగోదావరి ఏలూరు 44 విజయనగరం 43 శ్రీకాకుళం 40 విశాఖ విశాఖ 39 అనంతపురం అనంతపురం 39

ఇదీ చదవండి

నేడు సీఈఓ దగ్గరకు స్క్రీనింగ్​ కమిటీ నోట్

Last Updated : May 10, 2019, 4:41 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details