ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భోపాల్​లో శారదా ఆలయాన్ని పునః నిర్మించిన తెలుగువారు - reconstruction

మధ్యప్రదేశ్ భోపాల్​లో 40ఏళ్ల కిందట నిర్మించిన శారదా మాతా ఆలయాన్ని తెలుగు సాంస్కృతిక పరిషత్ భోపాల్ ద్వారా తెలుగువారు పునః నిర్మాణం చేశారు.

భోపాల్

By

Published : Jun 15, 2019, 4:23 PM IST

భోపాల్ లో శారదా ఆలయాన్ని పునః నిర్మాణం చేసిన తెలుగువారు

మధ్యప్రదేశ్ భోపాల్​లో 40ఏళ్ల కిందట ఆ రాష్ట్ర ప్రభుత్వం శారదా మాతా మందిర నిర్మాణానికి కొంత స్థలాన్ని కేటాయించింది. నాడు అక్కడ స్థిరపడిన తెలుగువారు, అధికారులు కలిసి చిన్న ఆలయాన్ని నిర్మించారు. కాలం గడిచే కొద్దీ మందిరానికి భక్తుల ఆదరణ, ప్రతిష్ట పెరగడంతో తెలుగు సాంస్కృతిక పరిషత్ భోపాల్ వారు పునః నిర్మాణం చేశారు. జూన్ 13 నుంచి 16 వరకూ పునఃప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తున్నారు. ఆగమ సంప్రదాయం ప్రకారం తితిదే అర్చకులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు, దక్షిణ భారత సంప్రదాయాల మేళవింపుగా ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు రెండు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details