తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ విజయవాడ రానున్నారు. మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం రానున్న కేసీఆర్... విజయవాడ గేట్ వే హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం కనకదుర్గమ్మను దర్శించుకొని... 2.30 గంటలకు తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి చేరుకుంటారు. జగన్ నివాసంలో భోజనం చేయనున్న కేసీఆర్... అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను ఆహ్వానిస్తారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి గేట్‌వే హోటల్‌కు వెళ్లనున్న కేసీఆర్...5 గంటలకు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళతారు. శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణకు హాజరవుతారు. రాత్రి 7.30 గంటలకు గన్నవరం నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.
నేడు విజయవాడకు తెలంగాణ సీఎం కేసీఆర్ - తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ విజయవాడ రానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను ఆహ్వానించనున్నారు.
నేడు విజయవాడకు రానున్న తెలంగాణ సీఎం కేసీఆర్