ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపాతోనే బీసీలు: అనురాధ - anuradha

బీసీ ఉప ప్రణాళిక కోసం వైఎస్ హయాంలో రూ.3 వేల కోట్లు కేటాయించినా.. నిధులు ఖర్చు చేయలేదని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం రూ.40 వేల కోట్లు కేటాయించి ఇప్పటికే రూ.33 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

మీడియాతో మాట్లాడుతున్న అనురాధ

By

Published : Feb 18, 2019, 4:12 PM IST

మీడియాతో మాట్లాడుతున్న అనురాధ
బీసీ ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని... ఆ పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన అనురాధ... బీసీలంతా తెదేపాతోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ హయాంలో రూ.3 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేయలేదని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం రూ.40 వేల కోట్లు కేటాయించి ఇప్పటికే రూ.33 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలియడానికి వైకాపా సభ్యులు సమావేశాలకు వస్తే కదా అని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details