నేడు విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.
నేడు విజయవాడలో తెదేపా ఇఫ్తార్ విందు
By
Published : Jun 3, 2019, 5:20 AM IST
నేడు విజయవాడలో తెదేపా ఇఫ్తార్ విందు
నేడు విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఇఫ్తార్ విందు నిర్వహించనుంది. ఏ1 కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇఫ్తార్ విందుకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర పరీశిలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మత సామరస్యం కోసం ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నగర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు పాల్గొనాలని కోరారు.