వైకాపా శాసన సభ్యురాలు శ్రీదేవి వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. సభలో ఇద్దరు వ్యాధి గ్రస్తులు కనిపిస్తున్నారని ఆమె అనడంతో తోటి సభ్యులు అవాక్కయ్యారు. " నేను డాక్టర్ని నాకు రోగుల సైకాలజీ తెలుసు... జగన్కు జనం అనే వ్యాధి ఉంది... చంద్రబాబుకు మాత్రం ధనం అనే వ్యాధి ఉంది" అంటూ మాట్లాడడంతో అందరూ ఆశ్చర్య పోయారు. ఆమె వ్యాఖ్యలపై తెదేపా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ కలుగ చేసుకుని... అసలు విషయంలోకి రావాలంటూ.. సూచించడంతో సభ శాంతించింది.
"జగన్, చంద్రబాబు ఇద్దరూ వ్యాధి గ్రస్తులే..."
తాడికొండ శాసన సభ్యురాలు శ్రీదేవి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒకేసారి... "జగన్, చంద్రబాబు ఇద్దరూ వ్యాధి గ్రస్తులే.." అంటూ వ్యాఖ్యానిచడంతో తెదేపా సభ్యులు అభ్యంతరం తెలిపారు. స్పీకర్ సైతం కలుగ చేసుకుని... అసలు విషయంలోకి రావాలంటూ సూచించారు.
సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీదేవి