ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సర్కార్ ఎక్స్​ప్రెస్ ఎక్కించారు...! కోడి రామకృష్ణ

'నీ మనసు ఏది చెబితే అదే చెయ్యి..ఏ పనైతే నువ్వు ఎంజాయ్ చెయ్యగలవో దాన్నే చెయ్యి. నీకు నచ్చని వ్యక్తికీ.. పనికీ దూరంగా ఉండు' అనే సిద్ధాంతంతో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించిన రామకృష్ణ మజిలీలోని కొన్ని స్మృతులు.

telugu director

By

Published : Feb 22, 2019, 8:33 PM IST

Updated : Feb 22, 2019, 9:56 PM IST

'నీ మనసు ఏది చెబితే అదే చెయ్యి.. ఏ పనైతే నువ్వు ఎంజాయ్ చెయ్యగలవో దాన్నే చెయ్యి. నీకు నచ్చని వ్యక్తికీ.. పనికీ దూరంగా ఉండు' అనే సిద్ధాంతంతో బతికిన ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ. ఆయన మనకు దూరంగా వెళ్లిపోయారన్న నిజాన్ని జీర్ణించుకోవడం కొంచెం కష్టమే...!
100పైగా చిత్రాలు ... అందులో ఎన్నో హిట్ సినిమాలు అందించిన దర్శకధీరుడి జీవితంలో కొన్ని మధుర ఘట్టాలు ..మీకోసం.
చిరంజీవి ఇచ్చిన ధైర్యం...
⦁ మొదటి చిత్రం 'ఇంట్లో రామయ్య.. వీధీలో కృష్ణయ్య' పెద్ద హిట్. ఈ మూవీ షూటింగ్​లో ఫస్ట్ షాట్ తీసిన తర్వాత...కెమెరాకు బ్యాటరీ కనెక్ట్ చేయలేదని తెలిసి ఆయన చాలా బాధపడ్డారు. ట్రాఫిక్​లో ఇరుక్కుపోయి హీరో లేట్​గా లొకేషన్​కొచ్చారు. డల్​గా కూర్చున్న కోడి రామకృష్ణకు... 'ఫస్ట్ షాట్ నాపైనే తీస్తానన్నారు కదా... పదండి తీసేద్దాం... ఇలాంటి సెంటిమెంట్లు పట్టించుకోకూడదని' చిరంజీవి ధైర్యం చెప్పి షూటింగ్ మొదలు పెట్టించారు.

కోడి రామకృష్ణ

'మెగాస్టార్ విసిరిన పండును నోటితో ఒడిసి పట్టా...'
⦁ అదే సినిమా షూటింగ్​లో ' నారింజ పండు విసురుతా... నోటితో అందుకోగలిగితే ఈ చిత్రం హిట్' అంటూ చిరంజీవి తమాషా చేశారు. లక్కీగా దాన్ని అందేసుకున్నాను అనే వారు. ఈ సినిమా 525 రోజులు ఆడి రికార్డు సృష్టించింది.
ఆశ్చర్యపోయిన నిర్మాత
⦁ ఆయన మద్రాసు ప్రస్థానం మొదలైన తర్వాత 'తరంగణి' మొదట రావాల్సిన చిత్రం. నిర్మాత రాఘవగారు సినిమా ఆగిపోయినా... కించిత్​ కోపం ప్రదర్శించలేదని ఇంకో చిత్రానికి అవకాశమిచ్చారు. --కోడి రామకృష్ణ.

దాసరి మెచ్చుకోలు..
⦁ అసలు కోడి రామకృష్ణకు నటుడవ్వాలని కోరిక. పాలకొల్లులో ఆయన స్నేహితుడైన నాగేశ్వరావు ఫొటో స్టూడియోలో దిగిన చిత్రాలతో సినిమాల్లో అవకాశాలకు ప్రయత్నించారు.
⦁ ఆయన దర్శకుడికంటే ముందు 'రాధమ్మ పెళ్లి' అనే చిత్రంలో హీరోయిన్ శారదతో ఒక సన్నివేశంలో నటించారు. ఆ షూటింగ్​లోనే దాసరితో రామకృష్ణకు తొలి పరిచయం ఏర్పడింది. మద్రాసుకెళ్లి మళ్లీ అదే సీన్​లో నటించి మెప్పించారు. 'మద్రాసు వచ్చీ... రాగానే అవకాశం... నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. మంచి దర్శకుడవుతావ్​' అని మెచ్చుకున్నారు దాసరి.
⦁ దాసరితో ప్రయాణం మొదలయ్యాక... గురువుగారు ఎక్కడున్నా... ఆయన పక్కనే ఉండేవాన్నని కోడిరామకృష్ణ గర్వంగా చెబుతుండేవారు.

వీధి నాటకాలేసిన డబ్బుతో..
⦁ చిన్నప్పుడు నాటకాలంటే పిచ్చి.. మెహనికి పసుపు, బొగ్గు, ఫేస్​ పౌడర్లే మేకప్ సామగ్రి. హైస్కూల్ స్థాయికి వచ్చే సరికి ఎన్నో ఉత్తమ నటుడి అవార్డులు ఆయన సొంతమయ్యాయి. అల్లురామలింగయ్య గారితోనూ కలిసి నాటకాలు వేశారు..కోడి రామకృష్ణ. స్నేహితులతో వీధి నాటాకాల్లో వచ్చిన డబ్బే ..మద్రాసు వెళ్లేటపుడు తన దగ్గరున్న మొత్తం సంపాదన. ఊరిని విడిచి వెళ్లలేక బెంగతో ఉన్న కోడిని సర్కారు ఎక్స్​ప్రెస్ ఎక్కించారు మిత్రులు .
విజయం నన్ను భయపెడుతుంది..ఎందుకంటే ఆ తరువాత దాన్ని మించింది మరోటి చెయ్యాలి. అందుకే ప్రతి సినిమాకి ఏడాది గ్యాప్ తీసుకుంటాననేవారు కోడి. సినీ ప్రపంచానికి గ్రాఫిక్స్ పరిచయమయ్యే రోజుల్లోనే 'అమ్మోరు' చిత్రంతోశభాష్ అనిపించుకున్నాడు ఈ దర్శకధీరుడు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ప్రయోగాలే ఎక్కువ...మరీ..!

ఇదీ చదవండి:కోడి హెడ్​బ్యాండ్ కథేంటి.!

Last Updated : Feb 22, 2019, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details