ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా ఎస్.శ్రీరామ్, అదనపు ఏజీగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి నియమితులు కానున్నట్లు తెలిసింది. పలువురు సీనియర్ న్యాయవాదుల పేర్లను పరిశీలించాక కాబోయే ముఖ్యమంత్రి జగన్ శ్రీరామ్, సుధాకర్‌రెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. రేపు జగన్ ప్రమాణస్వీకారం అనతంరం నియమాకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. వేసవి సెలవులను ముగించుకొని జూన్ 3న హైకోర్టు తిరిగి ప్రారంభం కానుంది. తదనంతరం ఎస్‌జీపీ, జీపీ, ఏజీపీ, స్టాండింగ్ కౌన్సిళ్ల నియామక ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ఏజీగా శ్రీరామ్ నియామకం...! - ag
ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా ఎస్.శ్రీరామ్, అదనపు ఏజీగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి నియమితులు కానున్నట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ ఏజీగా శ్రీరామ్