సమాచార దొంగతనం... ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన డేటా... చోరీ జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు... సిట్ ఏర్పాటు చేశారు. సిట్ బృందం డేటా చోరీ కేసును లోతుగా విశ్లేషిస్తుంది. తెదేపాకు చెందిన సమాచారం మొదట ఎక్కడ నుంచి ఎవరికి వెళ్లింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
సమాచార చోరీకి కుట్ర జరిగిందా... చౌర్యానికి ముందు నిందితులు సమావేశాలు నిర్వహించారా అని ఆరాతీస్తున్నారు. డిజిటల్ వేదికల నుంచి సమాచారాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నారు... దీనికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు. ఒక చోట నుంచి సమాచారం డౌన్లోడ్ చేసుకున్నా.. చూసినా... తొలగించినా... ఆ వివరాలన్నీ సంబంధిత క్లౌడ్‌లో నమోదవుతాయి.