ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. ఆంధ్రప్రదేశ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. రాష్ట్రానికి కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నియామకంతో.. నరసింహన్ ఇకపై తెలంగాణ గవర్నర్ గానే కొనసాగనున్నారు. ఈ మేరకు.. ఇవాళ సాయంత్రం విజయవాడకు రానున్న నరసింహన్.. ముఖ్యమంత్రి జగన్, ఇతర ముఖ్య నాయకులకు విందు ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లుగా తనకు సహాయసహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలపనున్నారు. ఇదే సందర్భంలో.. ఆయనకు ప్రభుత్వం తరఫున వీడ్కోలు పలకనున్నారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. గేట్ వే హోటల్ లో ఈ కార్యక్రమం జరగనుంది.
గవర్నర్ నరసింహన్ కు నేడే వీడ్కోలు
ఎల్లుండే రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయనున్నారు. ఇవాళే.. గవర్నర్ గా నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీడ్కోలు తీసుకోనున్నారు.
governor
24న కొత్త గవర్నర్ ప్రమాణం
రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా నియమితులైన బిశ్వభూషణ్.. 24న విజయవాడ రాజ్ భవన్ లో ప్రమాణం చేయనున్నారు. ఆయన భద్రత, పర్యవేక్షణ సహాయ అధికారిగా ప్రస్తుత విజయవాడ ట్రాఫిక్ అదనపు డీసీపీ మాధవరెడ్డిని ప్రభుత్వం నియమించింది.