వచ్చే ఏడాది 10% ఎక్కువగా విత్తన సేకరణ: సీఎం
విత్తనాల కోసం రెండు మూడు రోజులుగా రైతన్నలు పడుతున్న ఇబ్బందులపై సీఎం జగన్ ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా విత్తనాల కోసం రైతులు చేస్తున్న ఆందోళనల విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విత్తనాల కొరతపై ఆరా తీసిన జగన్... రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ ప్రణాళికా లోపం కారణంగానే సమస్య వచ్చిందని మంత్రి కన్నబాబు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే ఏడాది కోసం అవసరమైన దానికంటే 10 శాతం ఎక్కువగా విత్తనాలు సేకరించాలని సీఎం సూచించారు. జాతీయ విత్తన కార్పొరేషన్ ద్వారా సమస్యను పరిష్కరిస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి వెల్లడించారు. ఇదే సమయంంలో మిర్చి విత్తనాల ధరను ఎక్కువకు అమ్ముతున్నట్లు సీఎం దృష్టికి వెళ్లింది. ఎంఆర్పీ నిర్ణయించి సమస్య పరిష్కరిద్దామని జగన్ వారికి చెప్పారు.
TAGGED:
మంత్రి కన్నబాబు