ఫామ్ కోల్పోయిన ప్రతిసారీ ధోనీకి తరపున మాట్లాడే సౌరవ్ .. ఈసారి కూడా అతని వెంటే నిలిచారు. అఫ్గాన్ మ్యాచ్‌లో భారత్ 135 పరుగులకే నాలుగు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనీ 52 బంతుల్లో కేవలం 28 పరుగులే చేశాడు. కేదార్ జాదవ్‌తో కలిసి స్పిన్‌లో వేగంగా స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 224 పరుగులే చేసింది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి బౌలింగ్‌లో రాణించడంతో కోహ్లీసేన విజయం సాధించింది కానీ లేకుంటే.. మ్యాచ్ దాదాపు చేజారిపోయినంత పనైంది. తక్కువ స్కోర్ చేయడంపై ధోనీ-జాదవ్‌లపై విమర్శలు వచ్చాయి. అది కూడా స్పిన్ బౌలింగ్‌ను ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఎదుర్కోలేకపోవడాన్ని విమర్శకులు తప్పుపట్టారు. దిగ్గజ ఆటగాడు సచిన్ కూడా దీనిపై స్పందించాడు. "‘టీమిండియా బ్యాటింగ్ నిరాశ కలిగించింది. ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. కేదార్-ధోని భాగస్వామ్యం అసంతృప్తి కలిగించింది. వాళ్లు చాలా నెమ్మదిగా ఆడారు. స్పిన్ బౌలింగ్‌లో భారత్ 34 ఓవర్లు ఆడి కేవలం 119 పరుగులే చేసింది. స్పిన్‌ను ఎదుర్కోవడంలో భారత్ ఇబ్బందిపడింది. సానుకూల ఉద్దేశంతో ఆడలేదు’" అని ఆయన అన్నారు.
సచిన్ అలా అంటే.. సౌరవ్ ఇలా అన్నాడు..!
అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో వేగంగా ఆడలేక విమర్శలు ఎదుర్కొంటున్న మహేంద్రసింగ్ ధోనీకి టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ అండగా నిలిచారు. ప్రపంచకప్ ముగిసేలోపు అతనేంటో తప్పక నిరూపించుకుంటాడని ధీమా వ్యక్తం చేశారు. నెమ్మదిగా ఆడి.. సచిన్ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్న ధోనీపై దాదా మాత్రం నమ్మకం ఉంచాడు.
సచిన్ అలా అంటే.. సౌరవ్ ఇలా అన్నాడు..!
దాదా మాత్రం ధోనీని వెనకేసుకొచ్చారు. అఫ్గాన్‌పై తన ఫామ్‌ను పక్కన పెడితే ఈ ఏడాది ప్రపంచకప్‌లో అతనేంటో కచ్చితంగా నిరూపించుకుంటాడు. ఇది కేవలం ఒక మ్యాచ్ అంతే’ అని గంగూలీ అన్నారు. గతంలోనూ మహీపై విమర్శలు వచ్చినప్పుడు దాదా అండగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి...'ఆ ఇద్దరిలో భువీనే అత్యుత్తమ బౌలర్'
TAGGED:
dhoni good cricketer