వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని... చంద్రబాబు, మరో 21 పార్టీల నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం వీవీప్యాట్‌ల స్లిప్పులు లెక్కించాలని గతంలో పిటిషన్ దాఖలైంది. 21 ప్రతిపక్ష పార్టీల నాయకుల సంతకాలతో తెదేపా అధినేత చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా వాదనలు వినేందుకు... రాహుల్‌గాంధీ, చంద్రబాబు, కేజ్రీవాల్, ఇతర నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. అందుకుగాను సీఎం చంద్రబాబు నేటి రాత్రి దిల్లీకి పయనమవ్వనున్నారు.
నేడు దిల్లీకి సీఎం
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని చంద్రబాబు, 21 భాజపాయేతర పార్టీల నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణ సమయంలో దిల్లీలో ఉండాలని సీఎం భావిస్తున్నారు.
చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ