ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముస్లిం సోదరులకు సీఎం రంజాన్ శుభాకాంక్షలు - pawan kalyan

అల్లా దయతో ప్రజలు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. జనసేత అధినేత పవన్ కల్యాణ్, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ముస్లిం సోదరులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లిం సోదరులకు సీఎం రంజాన్ శుభాకాంక్షలు

By

Published : Jun 5, 2019, 3:47 AM IST

Updated : Jun 5, 2019, 6:40 AM IST

రాష్ట్రానికి, ప్రజలకు అల్లా దయ ఎల్లప్పూడూ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యనిష్ట సత్ప్రవర్తనకు ప్రతీక రంజాన్ అని తన సందేశంలో తెలిపారు. దీక్షలు , ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా భగవంతున్ని స్మరించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. అల్లా కరుణతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని తెలిపారు.

ముస్లిం సోదరులకు చంద్రబాబు రంజాన్ శుభాకాంక్షలు


దేశం సుభిక్షంగా ఉండాలి: చంద్రబాబు
అల్లా దయతో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దాతృత్వం, పరమత సహనం, శాంతియుత జీవనమే మహ్మద్ ప్రవక్త బోధనలని తెలిపారు. ముస్లిం సోదరులు స్నేహానికి మారుపేరని, సమాజంలో స్నేహ, సౌహార్ధ సంబంధాల కోసం అందరూ కృషి చేయాలని కోరారు.

ముస్లిం సోదరులకు పవన్ రంజాన్ శుభాకాంక్షలు


పవన్, రఘువీరా శుభాకాంక్షలు...
ముస్లిం సోదరులకు జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్, ఏ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సర్వ మానవాళి స్నేహ సౌభ్రాతృత్వానికి రంజాన్ ప్రతీకని వారు పేర్కొన్నారు.

ఇదీ చదవండీ: విరాళాల వివరాలు వెల్లడించని భాజపా, కాంగ్రెస్​

Last Updated : Jun 5, 2019, 6:40 AM IST

ABOUT THE AUTHOR

...view details