ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంఖ్య తగ్గిందని.. సమయం తగ్గించకండి! - speaker

తెదేపా ఎంపీల సంఖ్య తగ్గినా... సభలో మాట్లాడే సమయం మాత్రం తగ్గించొద్దని శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్​ నాయుడు కోరారు. లోక్​సభలో నూతన సభాపతి ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు.

ఎంపీ రామ్మెహన్​ నాయుడు

By

Published : Jun 19, 2019, 1:51 PM IST

Updated : Jun 19, 2019, 3:49 PM IST

ఎంపీ రామ్మెహన్​ నాయుడు

లోక్​సభాపతిగా ఓం బిర్లా ఎన్నికవడంపై తెదేపా ఎంపీ రామ్మోహన్​ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి కోసం సభ సజావుగా జరిగేలా చూడాలని సభాపతిని కోరారు. తెదేపా ఎంపీల సంఖ్య తగ్గినా... సభలో మాట్లాడేందుకు సమయం మాత్రం తగ్గించవద్దని కోరారు. దేశ, రాష్ట్ర సమస్యలపై తెదేపా ఎంపీల వాణి వినాలని విన్నవించారు. మాజీ సభాపతి సుమిత్రా మహాజన్​.. చర్చల్లో పాల్గొనేందుకు యువతను ఎంతగానో ప్రోత్సహించేవారని గుర్తు చేశారు. ప్రజల మంచి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సమర్థిస్తామని చెప్పారు.

Last Updated : Jun 19, 2019, 3:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details