అమరావతిలో సుప్రీంకోర్టు సీజేఐ పర్యటన - cj
నేడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పర్యటించనున్నారు.పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
నేడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పర్యటించనున్నారు. విజయవాడలోని నోవాటెల్ నుంచి బయల్దేరి అమరావతి చేరుకోనున్నారు. హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు శంకుస్థాపన, పూజా కార్యక్రమాలు నిర్వహించి శిలాఫలకం ఆవిష్కరించనున్నారు. శంకుస్థాపన స్థలం ప్రాంగణంలో గ్యాలరీ పరిశీలించనున్నారు. అనంతరం హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవంలో పాల్గొని కోర్టు హాళ్లను పరిశీలించనున్నారు. జ్యుడీషియల్ కాంప్లెక్స్ సభా కార్యక్రమంలో సీఎంతో పాటు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం భోజనాంతరం చంద్రబాబుతో కలిసి విహంగ వీక్షణం చేయనున్నారు.