ప్రచారంలోనూ చంద్రబాబు ట్రెండ్ సెట్టర్ చంద్రబాబు..టెక్నాలజీ. ఈ రెండు పేర్లు నాణేనికి బొమ్మాబొరుసు. సాంకేతికత వాడకంలో ఆయనకు ఆయనే సాటి. ఆలోచనల్లో ఆయన పదేళ్లు ముందుంటారు. ఒక్కోసారి బాబును చూస్తే టెక్నాలజీతో అవినాభావ సంబంధముందేమో అనిపిస్తోంది. అప్పట్లో కంప్యూటర్ విప్లవాన్ని ముందే గ్రహించి సాఫ్ట్వేర్కి పెద్దపీట వేశారు. హైటెక్ బాబుగా కీర్తి గడించారు. అదిరిందయ్యా చంద్రం
ఈ ఎన్నికల ప్రచారంలోనూ ట్రెండ్ సెట్టర్‌గా మారిపోయారు చంద్రబాబు. పాతకాలం నాటి మైక్‌ను పక్కన పడేసి పాప్ హెడ్‌తో కొత్తగా కనిపిస్తున్నారు. కేవలం చెవిలో మైక్ పెట్టుకుని తన హావభావాలు, ముఖ కవళికలతోనే ఓటర్లతో కనెక్ట్ అవుతున్నారు. కంటెంట్ జనాలకు చేరేలా మ్యాజిక్ చేస్తున్నారాయన. తాను చెప్పాల్సినది సూటిగా చెప్తున్నారు. తన ప్రసంగానికి ప్రాసలు, పంచ్‌లూ జత చేసి ఆకట్టుకుంటున్నారు.
నెట్టింటి ప్రచారం
ఇంటింటి ప్రచారంతో పాటు చంద్రబాబు నెట్టింటిప్రచారం షురూ చేశారు. నినాదాలే కవర్ పేజీలుగా ఫేస్బుక్, ట్విట్టర్లో పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2009 నుంచేచంద్రబాబు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఈ మధ్య ట్వీట్లతో ఫాలోవర్లకు టచ్‌లో ఉంటున్నారు. ప్రచారంలో డైలాగులు, సంక్షేమ పథకాలను తెలుగులో పోస్ట్ చేస్తున్నారు. ప్రత్యర్థివైకాపాపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కేంద్రాన్ని టార్గెట్ చేాసేప్పుడు మాత్రం ఇంగ్లిష్ ఉపయోగిస్తున్నారు.
అన్నింటికీ టెక్నాలజీనే
ప్రజల్లోకి వెళ్లడానికే పార్టీ నేతలతో అనుసంధానానికీ చంద్రబాబు టెక్నాలజీనే వాడతారు. 20 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా టెలీకాన్ఫరెన్స్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత అధికారంలో లేనప్పుడు పార్టీ కార్యకలాపాలకూసాంకేతికత వాడకాన్ని కొనసాగించారు. ఇప్పటికీ తెదేపా కార్యకర్తలకు టెలీకాన్ఫరెన్స్.. వీడియో కాన్ఫరెన్స్‌లతో దగ్గరగా ఉంటారు. పార్టీ అభ్యర్థుల ఎంపికనూ IVRS విధానంలో చేపట్టారు. ముఖ్యమైన కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చి ప్రత్యేక యాప్‌ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలన్నింటినీ కంప్యూటరీకరించారు. ఈ దఫా ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రభుత్వాన్నే పేపర్‌లెస్‌గా మార్చేశారు. దాదాపు నాలుగేళ్లుగా మంత్రివర్గ సమావేశాలన్నీ ఫైళ్లు.. పేపర్లు లేకుండానే జరుగుతున్నాయి.