ప్రారంభమైన పోలింగ్.. మొరాయిస్తున్న ఈవీఎంలు - general elections 2019
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 175 శాసనసభ నియోజకవర్గాలతో పాటు.. 25 లోక్‌సభ నియోజకవర్గాలకూ పోలింగ్ జరుగుతోంది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్న కారణంగా.. పోలింగ్ ఆలస్యమవుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 175 శాసనసభ నియోజకవర్గాలతో పాటు.. 25 లోక్‌సభ నియోజకవర్గాలకూ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 5.30 గంటలకే పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది మాక్ పోలింగ్ చేశారు. ఏర్పాట్లన్నీ సరి చూసుకున్న అనంతరం.. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లు మొరాయించిన కారణంగా... ప్రక్రియ ఆలస్యమవుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది విషయంలోనే ఈ పరిస్థితి ఎదురయింది. గుంటూరు జిల్లా తాడేపల్లి 35వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వెళ్లిన ద్వివేదికి ఈవీఎం పనిచేయని కారణంగా.. కాస్త గందరగోళం తలెత్తింది.
..
కడప జిల్లా చాపాడు మం. చిన్నగులవలూరు పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ల విషయంలో వాగ్వాదం తలెత్తింది. వేరే ప్రాంతాలకు చెందిన తెదేపా ఏజెంట్లను ఉంచేందుకు అనుమతించేది లేదని వైకాపా ఏజెంట్లు పట్టుబట్టారు. ఈ పరిణామంతో.. పోలింగ్ కేంద్రానికి తెదేపా అభ్యర్థులు ఆదినారాయణరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్ చేరుకున్నారు. స్థానికంగా ఉన్నవారినే ఏజంట్లుగా ఉంచాలని వైకాపా ఏజెంట్ల డిమాండ్ చేశారు. వివాదంపై.. జిల్లా కలెక్టర్‌తో ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి మాట్లాడారు. బ్రహ్మంగారిమఠం మండలం గంగిరెడ్డిపల్లిలోనూ ఏజంట్ల విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న దశలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. గొడవ పడుతున్న వారిని చెదరగొట్టారు.