రైతునేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావును పద్మశ్రీ వరించింది. ఈ రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారం తీసుకున్నారు. సేంద్రీయ వ్యవసాయంలో ఆయన చేసిన కృషికిగానూ ఈ అవార్డు లభించింది.
రైతునేస్తానికి 'పద్మం' - funtur
రైతునేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావును పద్మశ్రీ వరించింది. ఈ రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారం తీసుకున్నారు. సేంద్రీయ వ్యవసాయంలో ఆయన చేసిన కృషికిగానూ ఈ అవార్డు లభించింది.
యడ్లపల్లి వెంకటేశ్వరరావు 1968లో గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కొర్నేపాడులో జన్మించారు. రైతు కుంటుంబంలో పుట్టిన వెంకటేశ్వరరావు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. రైతునేస్తం ఫౌండేషన్ స్థాపించి, 12 ఏళ్లుగా మాసపత్రిక నడుపుతున్నారు. పశునేస్తం, ప్రకృతినేస్తం పత్రికలు ప్రారంభించి రైతులకు మరీ దగ్గరయ్యారు.
డా. ఐవీ సుబ్బారావు పేరుతో ప్రతి ఏటా వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ రంగాలలో విశేష ప్రతిభ కనబరచిన అధికారులకు, శాస్త్రవేత్తలు, రైతులు, పాత్రికేయులను రైతు నేస్తం పురస్కారాలతో గౌరవిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లోనూ యడ్లపల్లి పాలు పంచుకుంటున్నారు.