ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం

నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగ్మోహన్ రెడ్డి నేడు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.

జగన్ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం

By

Published : May 30, 2019, 6:09 AM IST

జగన్ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం

రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి విజయవాడ మున్సిపల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సమక్షంలో పూర్తి చేశారు. 30 వేల మంది అతిథులు వీక్షించేలా స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. ప్రమాణస్వీకారం వీక్షించేందుకు వీలుగా 14 ప్రదేశాల్లో భారీ ఎల్ ఈడీ తెరలను ఏర్పాటు చేశారు.జగన్ ప్రమాణస్వీకారానికి హాజరవ్వాలనుకునే సాధారణ ప్రజల్ని గేట్-3, గేట్ -6 నుంతి అనుమతించనున్నారు.
ప్రధాన వేదికపై ఆసీనులయ్యేది..?
ప్రధాన వేదికపై వైఎస్ జగన్ తో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయిస్తారని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. ఉపవేదికపై తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్, ప్రముఖ అతిథులు ఆసీనులవుతారన్నారు.
భారీ బందోబస్తు..
జగన్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా... విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి నుంచే భారీ వాహనాలను పట్టణంలోకి రాకుండా పోలీసులు ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. పాసులు ఉన్నవారంతా ఉదయం 10.30 గంటల లోపు స్టేడియానికి చేరుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details