ఈసీని కలిసిన ప్రతిపక్ష పార్టీల నేతలు
దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను పలు ప్రతిపక్ష నేతలు కలిశారు. 21 పార్టీలకు చెందిన నేతలు సీఈసీని కలిశారు. 50శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించాలన్న 21 విపక్ష పార్టీల రివ్యూ పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో సీఈసీని చంద్రబాబు సహా 21 విపక్ష పార్టీల నేతలు కలిశారు.
దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను పలు విపక్ష పార్టీల నేతలు కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా... 21 పార్టీలకు చెందిన నేతలు సీఈసీని కలిశారు. 50శాతం వీవీ ప్యాట్‌లను లెక్కించాలన్న 21 పార్టీల రివ్యూ పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో సీఈసీని ప్రతిపక్ష పార్టీల నేతలు కలిశారు. చంద్రబాబు, ఫరూక్ అబ్దుల్లా, డి.రాజా, అభిషేక్ మను సింఘ్వీ, సీపీఎం నేత నీలోత్పల్ బసు, డీఎంకే నేత ఇళంగోవన్, జేడీఎస్ నేత కుపేంద్రరెడ్డి, టీఎంసీ నేత సుఖేందు శేఖర్ రే, ఆర్‌ఎల్‌డీ నేత అహ్మద్ హమీద్, ఆప్ నేత సంజయ్‌సింగ్, ఐయూఎంఎల్ నేత అనిస్ ఒమర్, ఎన్‌పీఎఫ్ నేత కేజీ కెన్యే, ఎల్‌జేడీ నేత జావెద్ రజా తదితర నేతలు సీఈసీని కలిశారు.