ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అసలు పేరు కాదు.. ముద్దుపేరుతోనే ముందుకు! - అసలు పేరు

''నాన్నా... పండూ.. బంగారం... బుజ్జి.. కన్నా... నానీ''.... అదేంటి.. చిన్న పిల్లల పేర్లతో పిలుస్తున్నారు...అనుకుంటున్నారా? ఇవన్నీ ఇప్పుడు రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న అభ్యర్థుల ముద్దుపేర్లు. అసలు పేర్ల కంటే.. ఇలాంటి ముద్దుపేర్లతో పాపులర్ అయిన నాయకులు.. వాటితోనే ఎన్నికల పోరులో తలపడుతున్నారు.

అసలు పేరు కాదు..ముద్దుపేరుతోనే ముందుకు!

By

Published : Mar 27, 2019, 6:02 PM IST

అసలు పేరు కాదు..ముద్దుపేరుతోనే ముందుకు!
చిన్నప్పటి నుంచి ఇంట్లో పిలిచే ముద్దుపేరే కొనసాగితే... మహా అయితే పెద్దయ్యాక దగ్గరి బంధువులు మాత్రమే.. ఆముద్దు పేరుతోపిలుస్తారు. అదే పేరుతోరాష్ట్రం మెుత్తం పిలిస్తే...అందరికీ దగ్గరివాడు అనే అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడు అలాంటిముద్దుపేర్లతోనే ఎన్నికల్లో కొందరు నేతలు పోటీ పడుతున్నారు.తమ నామినేషన్ పత్రాలపై.. ఈవీఎంలపై లిఖించుకుంటున్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ట్రెండ్మరీ ఎక్కువగా కనిపిస్తోంది.

అంతా "నాని" లే..!

కృష్ణా జిల్లాలో ముగ్గురు నానిలు ఎన్నికల బరిలో ఉన్నారు. వారి అసలు పేర్లు... శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, వెంకట్రామయ్య. పశ్చమగోదావరిలోనూ ఇద్దరు నానిలు ఉన్నారు. చంద్రగిరి తెదేపా అభ్యర్థి ముద్దుపేరూ నానీనే. చిన్నప్పటి నుంచి ఇంట్లో పిలిచిన పేరే... వారికి రాజకీయాల్లోనూ స్థిరపడిపోయింది. వారిని అసలు పేర్లతో పిలిస్తే స్పందిస్తారో లేదో కానీ... ముద్దు పేరుతో పిలిస్తే తప్పకుండా పలుకుతారు. కొన్ని కుటుంబాల్లో మగపిల్లాడు పుడితే.. తాతే మళ్లీ జన్మించాడంటారు. అలా.. వారి పేరు పక్కన తాతయ్య అని ఉంటుంది. అలా జగ్గంపేట ఎమ్మెల్యే శ్రీరామ్​ తాతయ్య ఉన్నారు. మరి కొంతమంది నేతలకు వారి వ్యాపార సంస్థల పేర్లే ఇంటి పేరుగా మారిపోతాయి. ఉదాహరణకు ముత్తంశెట్టి శ్రీనివాస్ అంటే .. చాలామందికి తెలియదు. అదే.. అవంతి శ్రీనివాస్​ అంటే...అందరికీ సుపరిచితం.

ఈవీఎంల్లోనూ అదే పేరు..

ఈవీఎంలపై పేర్ల విషయంలో ముద్దుపేర్లున్న అభ్యర్థులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అసలు పేరు ఈవీఎంపై ఉంటే.. మెుదటికే మోసం వస్తుందనేది వారికి తెలుసు. ముద్దుపేరు లేకపోతే... ఓట్లు అటూఇటూఅయ్యే అవకాశం ఉంది. బ్యాలెట్​పై మీ పేరు ఎలా ఉండాలని నామినేషన్ పత్రంలో అడుడుతారు. ఆ సమయంలో.. కొందరు నేతలు తమ ముద్దుపేరే ముద్రితం అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అసలు పేరు ముద్దుపేరు నియోజకవర్గం పార్టీ
కేశినేని శ్రీనివాస్ నాని విజయవాడ (లోక్​సభ) తెదేపా
కొడాలి వెంకటేశ్వరరావు నాని గుడివాడ వైకాపా
పేర్ని వెంకట్రామయ్య నాని మచిలీపట్నం వైకాపా
ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని ఏలూరు వైకాపా
పులివర్తి వెంకట మణిప్రసాద్ నాని చంద్రగిరి తెదేపా
ఈలి వెంకట మధుసూదన్ రావు నాని తాడేపల్లిగూడెం తెదేపా
శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట తెదేపా
మాగంటి వెంకటేశ్వరావు బాబు ఏలూరు(లోక్​సభ) తెదేపా
బడేటి కోట రామారావు బుజ్జి ఏలూరు వైకాపా
పీజీవీఆర్ నాయుడు గణబాబు విశాఖపట్నం పశ్చిమం తెదేపా
వరుపుల జోగి రాజు రాజా ప్రత్తిపాడు(తూగో) తెదేపా
ముత్తంశెట్టి శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ భీమిలి వైకాపా
ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు కన్నబాబు రాజు యలమంచిలి వైకాపా
చవటపల్లి సత్యనారాయణమూర్తి డాక్టర్ బాబ్జీ పాలకొల్లు వైకాపా
దాడిశెట్టి రామలింగేశ్వరరావు రాజా తుని వైకాపా

ఇదీ చదవండి:దగ్గుబాటి దడ పుట్టిస్తారా? ఏలూరి ఏలేస్తారా?

ABOUT THE AUTHOR

...view details