తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవికి తాను రేసులో లేనని సినీ నటుడు మోహన్‌బాబు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
నాకు ఏ పదవులపై ఆశ లేదు: మోహన్‌బాబు - సినీనటుడు మోహన్ బాబు
తనపై వస్తున్న వార్తలను సినీ నటుడు మోహన్‌బాబు కొట్టి పారేశారు. తితిదే ఛైర్మన్ పదవికి తాను రేసులో లేనని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
''తితిదే ఛైర్మన్ పదవి రేసులో నేనున్నానని వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంలో నాకు కొన్నిరోజులుగా ఫోన్లు వస్తున్నాయి. నా కోరిక ఒక్కటే. జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను. ఆయన చేసే ప్రజాసేవకు నా వంతు సాయం చేయాలనుకుంటున్నాను. జగన్‌పై నమ్మకంతోనే నేను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాను. అంతేకానీ ఎలాంటి పదవులు ఆశించి కాదు. మీడియా వర్గాలు ఇలాంటి వదంతులు సృష్టించవద్దని కోరుతున్నాను'' అని మోహన్‌బాబు స్పష్టం చేశారు.
ఇవి చదవండి...సీఎం ముఖ్య సలహాదారుగా అజేయ కల్లం.. నెలకు 2.5 లక్షల జీతం