సభాపతి స్థానాన్ని దుర్వినియోగం చేశారు: రోజా
గతంలో స్పీకర్ స్థానాన్ని దుర్వినియోగం చేశారని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. తెదేపా ప్రభుత్వ హయంలో ప్రతి పక్షాల గొంతు నొక్కేశారని అసెంబ్లీలో అన్నారు.
నాడు సభాపతిగా ఉన్న యనమలను ఉపయోగించుకుని సభాపతి స్థానాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్వినియోగం చేశారని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. గత ప్రభుత్వం ఐదేళ్లు అహంకారంతో ప్రవర్తించిందని.. ఈ తీరును ప్రతి ఒక్కరూ చూశారన్నారు. ప్రతిపక్షంలో కూర్చున్న రెండో రోజే అసహనం చెందుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇచ్చి సభా గౌరవాన్ని పెంచుతారని ఆశిస్తున్నట్లు సభాపతి సీతారాంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. స్పీకర్ గా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు.