విజయవాడ గొల్లపూడిలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. గొల్లపూడి గ్రామ ప్రధాన కూడళ్లలో కలియతిరుగుతూ ఇంటింటికి వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాలు అందజేశారు. మరోసారి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలనికోరారు. రాష్ట్రంలో జల సంరక్షణ లో తీసుకున్న నిర్ణయాలు, తమ ప్రభుత్వం చేసిన సంస్కరణలు రైతులకుఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. వాటిని ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు తనకి మరోసారి పట్టం కడితే రాష్ట్రాన్నిసస్యశ్యామలం చేయడానికి కష్టపడతానిని వెల్లడించారు.